Home » Maoist Encounter
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు.
దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఒకప్పుడు గూగుల్ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు అడవుల్లో ఈనెల 7వ తేదీన నక్సల్స్ లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది.
ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు ( Maoist ) అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. మార్చి 19 కోళ్లమర్క అడవిలో జరిగిన కాల్పులను బూటక ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించింది.
National: రాష్ట్రంలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. చనిపోయిన నలుగురు నక్సల్ కమాండర్లపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఈరోజు (మంగళవారం) ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దంతేవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో.. పోలీసులు, మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి.