Home » Medak
మెదక్ జిల్లా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మెదక్ జిల్లా, జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందనరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డి అయితే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లపై మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. ఆదివారం మెదక్‌లో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వేర్వేరు కాదన్నారు. వారిద్దరు వీణా వాణిలాగా అవిభక్త కవలలని అభివర్ణించారు. కేసీఆర్ తీసుకు వచ్చిన జీవో 51ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది..
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కోహీర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్(Jagadgirigutta, Quthbullapur) ప్రాంతానికి చెందిన షేక్ అన్వర్‌అలీ(30) సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరసగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. రేపు మధ్యహాన్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా: జోగిపేట పట్టణంలో ఓ సైకో సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడిని హత్య చేశానని చెబుతూ నాగరాజు అనే సైకో హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడు పని చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణంలో నాగరాజు రాగితీగ దొంగతనం చేశాడు. ఆ విషయాన్ని..
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్‌లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.