Share News

Raghunandan rao: నా గొంతుని కాపాడండి.. మోసపోయి మీరు ఆగం కావొద్దు

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:54 AM

Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.

Raghunandan rao: నా గొంతుని కాపాడండి.. మోసపోయి మీరు ఆగం కావొద్దు
BJP MP Candidate Raghunandan Rao Elections campaign

సిద్దిపేట, ఏప్రిల్ 22: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (BJP MP Candidate Raghunandan Rao) ఎన్నికల ప్రచారంలో (Election Campaign) దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి (BJP) ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ (BRS) నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి


ఎమ్మెల్సీ ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గడుస్తున్నా సంవత్సరానికి 100 కోట్ల చొప్పున నిధులు తీసుకురాని అసమర్ధత వ్యక్తి వెంకటరామిరెడ్డి అని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న మొగురాలు, వాసాలనే తన చితిగా పేర్చుకొని చనిపోయినప్పుడు చలించని వ్యక్తి అప్పట్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అని అన్నారు. 30 మంది కలెక్టర్లలో ఈయనా ఒక కలెక్టర్ అని... కానీ జిల్లాకు ఊరగబెట్టిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.


డిపాజిట్ రానటువంటి వ్యక్తి కొబ్బరికాయలు, కత్తర్లు పట్టుకొని వచ్చి తిరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి పోయారని.. వాళ్ళ నోర్లు ఎందుకు తెరుస్తలేరని ప్రశ్నించారు. రఘునందన్ రావు శిలాఫలకాలకు కొబ్బరికాయలు కొడుతున్నానంటే 50 మంది బీఆర్ఎస్ నాయకులు వచ్చేవారని.. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. డిపాజిట్ రాని వ్యక్తి పథకాలు ప్రకటించుకుంటూపోతున్నారని విమర్శించారు. ఈరోజు దుబ్బాక క్యాంపు కార్యాలయంలో 5 నెలల నుంచి అందుబాటులో లేని వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అని అన్నారు.

Loksabha Elections: బెంగళూరు చేరిన ఖమ్మం పంచాయితీ


ఒక క్లర్క్‌ను కూడా క్యాంపు కార్యాలయంలో అందుబాటులో పెట్టలేదన్నారు. ఇప్పటి వరకు దుబ్బాక కార్యాలయంలోకి దుబ్బాక ఎమ్మెల్యే అడుగు పెట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రఘునందన్ రావు ఎప్పటికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తప్పుడు వ్యక్తులైన బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. హోంగార్డులకు, అంగన్వాడీలకు ఆఖరికి జర్నలిస్టులకు డబల్ బెడ్రూంలు ఇళ్ల స్థలాలు కేటాయిస్తలేదని ప్రశ్నించిన గొంతుక రఘునందన్ రావు ది అని చెప్పుకొచ్చారు. ‘‘ఈ నా గొంతుని కాపాడండి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఈరోజు మోసపోయి మీరు ఆగం కావొద్దు’’ అంటూ రఘునందన్ రావు ప్రజలను కోరారు.


ఇవి కూడా చదవండి...

Liquor Lovers: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..

TS Politics: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 22 , 2024 | 12:30 PM