Home » Medak
Telangana: ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా కొహెడ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్‌కు ఏం చేశానో తనను అనే ముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో పొన్నం చెప్పాలని డిమాండ్ చేశారు.
హావేలి ఘనపూర్ మండలం తొగిటలో ఈ నెల 11న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. రెండో భార్యతో జీవించడానికి అడ్డుగా వస్తుందన్న కారణంతో మొదటి భార్యను అడ్డు తొలగించుకోవడానికి భర్తే ఈ హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది.
Telangana: ఫ్రెండ్స్ అన్నాక దావత్‌లు చేసుకోవడం కామన్. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాల్సిందే. స్నేహితులు గ్రూప్‌గా ఏర్పడి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి సైతం తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు.
Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. బీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
TS Politics: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం నాడు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. దీంతో వీరి భేటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ భవన్లో ఈ రోజు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు.
మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందని, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Telangana: బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయి ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు మంచివాడే కాదని ఎవరు కూడా అనరని.. రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
సిద్దిపేట జిల్లా: భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి తోటబావి వద్ద కన్నుల పండువగా మల్లన్న కళ్యాణ వేడుక జరగనుంది.