Venkatram Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ABN , Publish Date - Apr 13 , 2024 | 04:00 PM
Telangana: ‘‘నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు’’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయన్నారు.
మెదక్, ఏప్రిల్ 13: ‘‘నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు’’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామ రెడ్డి (BRS MLC Venkatram Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయన్నారు. సిద్ధాంతాలు, విలువలు గాలికి వదిలి ప్రజల్ని మభ్యపెట్టే స్థాయికి దిగజారాయన్నారు.
Sydney mall stabbing: షాపింగ్ మాల్‌లో కలకలం, దండగుడి దాడిలో ఐదుగురు దుర్మరణం
ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు నిజాయతీగా సేవలు అందించానని చెప్పుకొచ్చారు. ప్రజా సేవకుడిగా ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి ప్రత్యక్ష రాజకీయంలోకి వచ్చానని వెల్లడించారు. పేద విద్యార్థులకు విద్య అందించేందుకు, స్కిల్ డెవలపమెంట్ కార్యక్రమాల కోసం వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు ప్రకటించానని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తా అని మాట ఇచ్చానన్నారు. తాను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని... నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదున్నారు. ఈ విషయం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చారు. ప్రజల అభిమానం మెండుగా ఉన్న తనపై విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని.. తన మనో స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తన వైపే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తల పుకార్లు వ్యాప్తి చేయడం మాని విధానాలు సిద్ధాంతాల పరంగా ఎన్నికల్లో తలపడదామని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు వెంకట్రామరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
TS News: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై కమిషనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Bournvita: బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్ కాదు’.. కేంద్రం సంచలన ఆదేశాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...