Home » Medical News
ఒక వైద్యుడు ఏదైనా వ్యాధి నిర్ధారణ చేస్తే రోగులు రెండో అభిప్రాయం (సెకండ్ ఓపీనియన్) కోసం మరో వైద్యుడిని సంప్రదిస్తుంటారు. అయితే, మన దేశంలో కాస్త డబ్బున్న ఇలాంటివారు ఏటా కోటిమంది క్లిష్టమైన జబ్బులపై సలహా కోసం అమెరికాలోని వైద్యుల వద్దకు వెళ్తున్నారు.
పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక కరీంనగర్ శివారులోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమళ్ల శిరీష(20) శనివారం ఆత్మహత్య చేసుకుంది.
వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.
మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) రెండూ ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది.
కంటిచూపు క్షీణించిన వృద్ధుల్లో మెదడు పనితీరు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి (ఎల్వీపీఈఐ) పరిశోధకులు డాక్టర్ శ్రీనివాస్ మర్మముల వెల్లడించారు.
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ(NEET UG 2024)లో పేపర్ లీక్, ఇతర అవకతవకలపై దాఖలైన 40కి పైగా పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్(Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కూడా ఈ అంశంపై విచారించి నేటికి వాయిదా వేసింది.
వైద్య ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో గందరగోళంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. బదిలీలపై నర్సులు ఆందోళన చేయడం, సంఘాల పేరిట లేఖలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది.
వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఐదు వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.