Share News

Dementia risk: కంటిచూపు తగ్గితే డెమెన్షియా ముప్పు

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:48 AM

కంటిచూపు క్షీణించిన వృద్ధుల్లో మెదడు పనితీరు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి (ఎల్‌వీపీఈఐ) పరిశోధకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ మర్మముల వెల్లడించారు.

Dementia risk: కంటిచూపు తగ్గితే డెమెన్షియా ముప్పు

  • ఎల్‌వీపీఈఐ పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కంటిచూపు క్షీణించిన వృద్ధుల్లో మెదడు పనితీరు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి (ఎల్‌వీపీఈఐ) పరిశోధకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ మర్మముల వెల్లడించారు. కంటిచూపు సరిగా ఉన్నవారితో పోల్చితే.. దృష్టిలోపం ఉన్నవారికి మతిభ్రంశం(డెమెన్షియా) వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువని తెలిపారు.


వెల్‌కం ట్రస్ట్‌, డీడీ ఇండి యా సహకారంతో నగరంలోని వృద్ధాశ్రమాల్లో 60 ఏళ్లు పైబడిన 1,515 మంది వృద్ధులపై ‘హైదరాబాద్‌ ఆక్యులర్‌ మోర్బిడిటీ ఇన్‌ ఎల్డర్లీ’ పేరుతో పరిశోధన నిర్వహించారు. కంటిచూపు మందగించడంతో డెమెన్షియా వచ్చే అవకాశం పురుషులకంటే మహిళలకు 2 రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేలిందన్నారు. ఈ పరిశోధన ఫలితాలను బీఎంజే ఓపెన్‌ యాక్సిస్‌ జర్నల్‌లో ప్రచురించారు.

Updated Date - Jul 25 , 2024 | 04:48 AM