Home » Modi 3.0 Cabinet
మోదీ3.0 కేబినేట్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు కేంద్రమంత్రి పదవులు వరించాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లను (Bandi Sanjay) కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్‌లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రిగా..
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.