Share News

Modi3.0 Cabinet: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. శ్రీనివాసవర్మ

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:09 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్‌లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.

Modi3.0 Cabinet: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. శ్రీనివాసవర్మ

ఢిల్లీ: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్‌లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస వర్మ భారీ విజయం సాధించారు. రాష్ట్రం నుంచి ఇప్పటికే తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్రమంత్రి పదవులు వరించాయి.


సౌమ్యుడిగా పేరు..

కాగా.. 1988లో బీజేపీ కార్యకర్తగా శ్రీనివాసవర్మ రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992-95లో పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా శ్రీనివాస వర్మ గెలుపొందారు. ఇన్‌చార్జి చైర్మన్‌గానూ ఆయన సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ఎంతగానో సహకరించారు.

బీజేపీలో సామాన్య కార్యకర్తలకు ఏ కష్టం మొచ్చిన ముందుండి సాయం చేస్తారనే పేరు కూడా ఆయనకు ఉంది. వైసీపీ పాలనలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే వాటిని ముందు ఉండి కూడా ఎదుర్కొని వారికి అండగా నిలిచారనే పేరు కూడా ఆయనకు ఉంది. ఈ అంశాలను కూడా కేంద్ర అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకొని శ్రీనివాసవర్మకు కేంద్రమంత్రిగా అవకాశం కల్పించినట్లు సమాచారం. అయితే మోదీ3.0లో కేంద్రమంత్రి వదవీ వరించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్తగా ఆయన చేసిన సేవలను కేంద్ర బీజేపీ నాయకులు గుర్తించడతోనే శ్రీనివాసవర్మకు ఈ పదవీ వరించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు.


నాపై మరింత బాధ్యత పెరిగింది: శ్రీనివాస వర్మ

‘‘కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నాకు ఉదయం ఫోన్ వచ్చింది. నాపై ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు అవకాశాలు ఉంటాయని చెప్పేందుకు నేను ఒక ఉదాహరణ. కేంద్రమంత్రిగా అవకాశం రావడం సంతోషకరం, ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవం. నన్ను ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతా. ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తాను. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ వెనక్కి వెళ్లింది . ఏపీ బీజేపీ నేతలు, ప్రజలు నాకు ఈ విజయాన్ని ఇచ్చారు. సామాన్య కార్యకర్త అయిన నన్ను ఎంపీగా గెలిపించి కేంద్రమంత్రిని చేశారు’’ అని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Modi Cabinet: లాస్ట్ మినిట్‌లో లక్కీఛాన్స్.. విధేయతకు దక్కిన పదవి..

AP Congress: ఏపీ కాంగ్రెస్ నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరిక..

Read Andhra Pradesh and Latest Telugu News

Updated Date - Jun 09 , 2024 | 04:22 PM