Share News

Modi 3.0 cabinet:కేంద్రమంత్రి పదవులపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:52 PM

మోదీ3.0 కేబినేట్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు కేంద్రమంత్రి పదవులు వరించాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లను (Bandi Sanjay) కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు.

Modi 3.0 cabinet:కేంద్రమంత్రి పదవులపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Kishan Reddy

హైదరాబాద్: మోదీ3.0 కేబినేట్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు కేంద్రమంత్రి పదవులు వరించాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లను (Bandi Sanjay) కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. నేడు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఈనేపథ్యంలో కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చరిత్రలో ఎన్నడూ సాధించలేని ఫలితాలను లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి సాధించిందన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన 88 స్థానాల్లో గెలవాలి, ఆ లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేయాలని కోరారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని తెలిపారు. ఈరోజు (ఆదివారం) ఢిల్లీ వేదికగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ నేతలకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఒక కేంద్రమంత్రి, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి ధన్యవాదాలు చెప్పారు.


సాధారణ కార్యకర్తలుగా పనిచేసిన ముగ్గురిని మంత్రులుగా చేసిన ఘనత బీజేపీదేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తానని మాటిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని ఉద్ఘాటించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల ఇల్లు ప్రజలకు కట్టి ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో పార్టీ పటిష్టం చేయడంలో కార్యకర్తలు దృష్టిపెట్టాలన్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా దేశమంతా సంబరాల కార్యక్రమాలు నిర్వహించాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ నుంచి.. కేంద్ర మంత్రి వరకు.. 'బండి' ప్రయాణం సాగిందిలా

Ponguleti: అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 05:13 PM