Home » Modi Cabinet
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నేడు (జూన్ 9న) దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరీ దృష్టి కూడా మంత్రివర్గంపై(Cabinet) పడింది. ఎవరికీ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎవరు మోదీ 3.0 క్యాబినెట్(Modi 3.0 Cabinet)లో చోటు దక్కించుకోనున్నారనే ఆసక్తి మొదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Narendra Modi Swearing as PM: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మోదీ 3.0’ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.
16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశప్రజలకు తెలుసునని చెప్పారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) భూటాన్ వెళ్లారు. గురువారమే పీఎం మోదీ భూటాన్ వెళ్లాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.