Home » MP Avinash Reddy
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక(YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్ బెయిల్‌ని(Bail) రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో వివేక హత్య కేసు అప్రూవర్ షేక్ దస్తగిరి పిటిషన్ వేయడం జరిగింది. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్‌రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి మౌనంగాఉండి ఈరోజు వివేకా నంద రెడ్డి హత్య గురించి మాట్లా డుతున్నారని.. ఆయనకు ప్రతి ఒక్కటి బాగా తెలుసని ఈ హత్య కేసు నిందితుడు, జై భీమ్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి తెలిపారు. సిద్ధం సభలు పెట్టుకొని జగన్మో హన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవ రు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్‌ని టార్గెట్‌గా చేసి మాట్లాడడం మానుకోవాలని మందలించారు.
ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇవాళ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె కడప జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. అయితే నేడు ముఖ్యంగా తన సొంత ఇలాఖా, తన సోదరుడు, ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులో షర్మిల పర్యటించనున్నారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి (YS Sunita Reddy) బయటపెట్టారు. పక్కా స్కెచ్ వేసి తన నాన్నను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకాను సీఎం జగన్ పక్కన పెట్టాలని చూశారని.. అయినా ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. వారి అరాచకాలకు అడ్డువస్తున్నారనే అక్కసుతో హత్య చేయించారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలన్నదే వివేకా కోరిక అని చెప్పారు.