Viveka Case: వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా
ABN , Publish Date - May 17 , 2024 | 01:05 PM
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.
హైదరాబాద్, మే 17: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో (Namapally Court) విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy), ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు. అయితే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) మాత్రం ఈరోజు విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11 (జూన్ 11)కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి....
BJP: మమతా.. మీ రేటెంత? అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
AP Elections: గన్నవరం చాలా స్పెషల్ గురూ.. ఎందుకో మీరే చూడండి..!
Read Latest Telangana News And Telugu News