Share News

MP Avinash: కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ అవినాష్ విమర్శలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 03:39 PM

Andhrapradesh: వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూట గట్టుకుందని కడప ఎంపీ తెలిపారు. పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

MP Avinash: కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ అవినాష్ విమర్శలు
Kadpa MP Avinash Reddy

కడప, అక్టోబర్ 2 : కూటమి ప్రభుత్వ పాలనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచకపాలన నడుస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూట గట్టుకుందని తెలిపారు.

Sensational: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ సంచలనం


పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ కార్యకర్త రాంగోపాల్ రెడ్డిని నడిరోడ్డుపై కొట్టుకుంటూ టీడీపీ ఆఫీస్‌‌కు తీసుకెళ్ళారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేదన్నారు. పులివెందులలో అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కృతి లేదన్నారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నారు. పులివెందులలో జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలన్నారు.

Actor Govinda: నటుడు గోవిందను కలిసిన క్రైం బ్రాంచ్ అధికారులు


పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజ్‌కు అడ్మిషన్లు రాకుండా చేసింది కూటమి ప్రభుత్వం అంటూ ఆరోపించారు. వి కొత్తపల్లె గ్రామంలో వీఆర్ఏ నరసింహ అనే వ్యక్తిని జిలెటిన్ స్టిక్స్ పేల్చి హత్య చేశారన్నారు. పులివెందులలో విచ్చలవిడిగా డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్.. మీడియాకు ప్రత్యేకంగా చూపించిన పవన్

CM Chandrababu: చెత్త పన్నుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 04:45 PM