BTech Ravi: ఎంపీ అవినాష్ వ్యాఖ్యలను ఖండించిన బీటెక్ రవి
ABN , Publish Date - Oct 03 , 2024 | 03:34 PM
Andhrapradesh: డైనమేట్లతో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది వైఎస్ కుటుంబమే. కూటమి ప్రభుత్వం ఎక్కడ అక్రమ మైనింగ్ వ్యాపారం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటివేళ్ళతో పేకళించడం జరిగిందని...
కడప, అక్టోబర్ 3: పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) చేసిన వ్యాఖ్యలను పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి (TDP Leader BTech Ravi) తీవ్రంగా ఖండించారు. గడిచిన ఐదు సంవత్సరాలు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టించుకుంది ఎవరో పులివెందుల ప్రజలకు తెలుసన్నారు. అలాగే అక్రమ మైనింగ్ వ్యాపారం చేసింది వైఎస్ కుటుంబమే అంటూ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం రాజకీయ పునాదులు అక్రమ మైనింగ్ ద్వారా మొదలైందన్నారు.
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. ఇన్వెస్టర్లు ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారంటే..
40 ఏళ్లుగా అక్రమ మైనింగ్ వ్యాపారం వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే జరిగిందన్నారు. కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఒక వివాహేతర సంబంధ హత్య కూడా కూటమి ప్రభుత్వం మీద నెపం వెయ్యడం మంచి పద్ధతి కాదన్నారు. డైనమేట్లతో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది వైఎస్ కుటుంబమే అంటూ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎక్కడ అక్రమ మైనింగ్ వ్యాపారం చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటివేళ్ళతో పేకళించడం జరిగిందని బీటెక్ రవి స్పష్టం చేశారు.
ఇంతకీ ఎంపీ ఏమన్నారంటే...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచకపాలన నడుస్తోందంటూ కడప ఎంపీ విమర్శలు గుప్పించారు. వంద రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అన్నారు. వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూట గట్టుకుందని అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
Etela Rajender:భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
వైసీపీ కార్యకర్త రాంగోపాల్ రెడ్డిని నడిరోడ్డుపై కొట్టుకుంటూ టీడీపీ ఆఫీస్‌కు తీసుకెళ్ళారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేదన్నారు. పులివెందులలో అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కృతి లేదన్నారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నారు. పులివెందులలో జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలని వ్యాఖ్యానించారు. పులివెందులలో విచ్చలవిడిగా డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
అలాగే.. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం నిర్వాకంవల్ల రాష్ట్రంలో 750 మెడికల్ సీట్లు కోల్పోయామని, పులివెందులకు ఈ ఏడాది 150 మెడికల్ సీట్లు వస్తే 50 సీట్లు వద్దని చెప్పారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నడిపే ఉద్దేశం లేదని, వారి దృష్టి అంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీదే ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు.పెంచిన 50 సీట్లు వస్తే జగన్మో హన్ రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో 50 సీట్లు వద్దని చెప్పిందన్నారు. ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల పెంచిన మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
TTD: శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో కీలక ప్రకటన
Pattabhiram: టీటీడీ లడ్డూ వివాదం... ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి...
Read Latest AP News And Telugu News