Home » MP Avinash Reddy
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం ఇస్తే జగన్ ఆన్న హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకున్నారని.. మళ్ళీ వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ హంతకుడిని కాపాడుతున్నారని ఆరోపించారు.
నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి.. అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం.. వీలైతే జగన్‌ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే తన లక్ష్యం అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని ఆమె అన్నారు.
నేడు కడప జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి పర్యటించనున్నారు. షర్మిళ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా ఖరారైన నేపద్యంలో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేకప్రార్ధనలు చేసి అభ్యర్ధుల జాబితాను ఆమె విడుదల చేయనున్నారు.
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాం గ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ-8గా చేర్చింది. దీంతో ఆయన బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.
ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక చివరి జాబితాను ఇడుపులపాయ నుంచి జగన్ ప్రకటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం... వైసీపీ అభ్యర్ధుల చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.