YS Sharmila: ఇవాళ సునీతతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న షర్మిల
ABN , Publish Date - Apr 20 , 2024 | 07:17 AM
ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నారు.
కడప: ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా.. సీఎం జగన్‌కు సొంత జిల్లాలోనే సొంత చెల్లెలు షర్మిల చుక్కలు చూపిస్తున్నారు. బాబాయి కూతరు కూడా షర్మిలకు తోడవడంతో ఇద్దరూ కలిసి జగన్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు.
గత ఎన్నికల్లో జగన్‌కు ప్లస్ అయిన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య ఇప్పుడు పూర్తిగా మైనస్ అయిపోయింది. గత ఎన్నికల్లో అన్న విజయం కోసం అలుపెరగక శ్రమించిన షర్మిల ఇప్పుడే సవాల్ విసురుతున్నారు. వివేకా మరణంలో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర.. ఆయనకు అండగా నిలిచి జగన్‌ను షర్మిల ఏకి పారేస్తున్నారు. ఈ సమయంలో తల్లి విజయమ్మ సాయం తీసుకుందామనుకున్నా కూడా ఆమె అమెరికాకు వెళ్లిపోవడం జగన్‌కు మరింత ఇబ్బందికరంగా పరిణమించింది. మొత్తానికి చెల్లెళ్లు షర్మిల, సునీత కొట్టే దెబ్బకు జగన్ అయితే విలవిల్లాడుతున్నారనడంలో సందేహం లేదు.
సింహాచలం దేవస్థానాన్ని కలెక్టర్ చేతిలో పెడితే ఎలా!?
లోగ్రేడ్ మార్కెట్ ఒడిదొడుకులు
మరిన్ని ఏపీ వార్తల కోసం..