Share News

YS Viveka Case: వివేకా హత్య కేసులో తాజా అప్‌డేట్ ఇదే..

ABN , Publish Date - Apr 15 , 2024 | 06:45 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

YS Viveka Case: వివేకా హత్య కేసులో తాజా అప్‌డేట్ ఇదే..

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకుని అబద్ధపు సాక్ష్యం చెప్పాల్సిందిగా తనని వేధిస్తున్నారంటూ దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశారు.


Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

ఇప్పటికి తన కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆయన పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తక్షణమే రద్దు చేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. అవినాష్ రెడ్డి తన అన్న జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షులను బెదిరిస్తున్నారని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.


AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

అవినాష్ రెడ్డి బెయిల్ తక్షణమే రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, జైలు అధికారులు, కుమ్మక్కై సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. అవినాష్ రెడ్డి బెయిల్ తక్షణమే రద్దు చేయకపోతే విచారణ సరిగ్గా జరగదని సీబీఐ తరుపు న్యాయవాది వివరించారు.


అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన దగ్గర నుంచి ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేశాడనటానికి తగిన ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. తక్షణమే బెయిల్ రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. అవినాష్ బెయిల్‌పై ఉండటానికి వీలులేదని కోర్టుకు సునీత తరుపు న్యాయవాది తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మరోసారి రిజర్వ్ చేసింది.


AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 06:53 PM