AP Elections: పవన్ నెత్తిన పాలుపోస్తున్న ముద్రగడ ..!
ABN , Publish Date - May 06 , 2024 | 03:17 PM
ఏపీలో ఎన్నికల వేళ అందరిదృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీచేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఏకైక లక్ష్యంతో వైసీపీ ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కాపు ఉద్యమనాయకుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుని.. పిఠాపురంలో పవన్‌ను ఓడించే బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో ఎన్నికల వేళ అందరిదృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీచేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఏకైక లక్ష్యంతో వైసీపీ ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కాపు ఉద్యమనాయకుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుని.. పిఠాపురంలో పవన్‌ను ఓడించే బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో తమ సొంత సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ విరుచుకుపడుతున్నారు. హద్దులు దాటి విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం నుంచి తన్నితరిమేస్తానంటూ తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు.
ముద్రగడ వ్యవహరంపై పవన్ అభిమానులతో పాటు పద్మనాభం కుటుంబ సభ్యులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటివరకు ముద్రగడను అభిమానించే నాయకులు సైతం ఆయనకు కొంచెం దూరంగా ఉంటున్నారంట. హద్దులు మీరి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం ద్వారా పిఠాపురంలో కాపు సామాజికవర్గం నేతలతో పాటు ఇతర సామాజిక వర్గం నేతలు ఏకతాటిపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా పవన్‌ను ఓడించాలనుకున్న ముద్రగడ ఇప్పుడు జనసేనాని నెత్తిపై పాలుపోస్తున్నారని పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం!
ముద్రగడపై పెరుగుతున్న వ్యతిరేకత..
రాజకీయంగా ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజం. కానీ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతం టార్గెట్ చేయడంపై కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్‌పై ముద్రగడ అంత వైర్యం ఎందుకని మరికొందరి నోట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న ప్రతిసారీ జనసేనానికి అది బలంగా మారుతుందట. తాజాగా ముద్రగడ పద్మనాభం కుమార్తె తన తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో ముద్రగడ వైసీపీలో ఉన్నప్పటికీ పవన్ గెలుపు కోసం పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ముద్రగడకు సొంత కుటుంబ సభ్యులే దూరమవుతున్నారట. వాళ్లంతా పవన్‌కు జై కొడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు పిఠాపురంలో కాపు ఓటర్లంతా ఏకమై పవన్‌ను గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముద్రగడపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుందట. కాపు ఓటర్లే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓటర్లు కూడా.. ముద్రగడ వ్యవహరంతో పవన్‌పై సానుభూతి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ నెత్తిన పాలు..
ముద్రగడ పద్మనాభం ఒకటి అనుకుంటే పిఠాపురంలో మరొకటి జరిగేలా ఉందనే అభిప్రాయం ప్రస్తుతం వైసీపీ నాయకుల నోట వినిపిస్తుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్‌ను ఎక్కువుగా టార్గెట్ చేసి.. ఇక్కడి ప్రజలకు ముద్రగడ శత్రువుగా మారారనే చర్చ నడుస్తోంది. ఓ రకంగా పవన్ నెత్తిన ముద్రగడ పాలు పోశారంటూ కొందరు చెబుతున్నారు. ముద్రగడ పవన్ నెత్తిన పాలు పోశారా లేదా.. అనుకున్నది సాధించారా అనేది జూన్4న తేలనుంది.
AP Elections: జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu news