Share News

AP Politics: ముద్రగడ పేరు మారింది.. గెజిట్ విడుదల పేరు మారింది..

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:04 AM

ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సవాలు చేస్తుంటారు. పేరు మార్చుకుంటానని కొందరు, ముక్కు నేలకు రాస్తానని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరికొందరు.. క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు.

AP Politics: ముద్రగడ పేరు మారింది.. గెజిట్ విడుదల  పేరు మారింది..
Mudragada

ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సవాలు చేస్తుంటారు. పేరు మార్చుకుంటానని కొందరు, ముక్కు నేలకు రాస్తానని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరికొందరు.. క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు. ఎవరైనా సవాలు గురించి అడిగితే.. నేను చేసిన మాట వాస్తవమే.. నా సవాలుకు ప్రత్యర్థులు స్పందిచలేదంటూ మాట మారుస్తారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు ఎన్నో చూశాం. అందులో ఒకటి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. దీంతో ముద్రగడ పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారంటూ నెటిజన్లె ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక చేసేదిలేక తాను చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించి.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారింది.

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం


కుమారుడితో కలిసి..

ముద్రగడ పద్మనాభం ఈ ఏడాది మార్చి 27వ తేదీన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరినట్టు ప్రకటించారు. అంతకు ముందు ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్‌‌ను ఓడించేందుకు ముద్రగడ పద్మనాభానికి వైసీపీ బాధ్యతలు అప్పగించింది.ఈ క్రమంలో ముద్రగడ తీరుపై సొంత కుమార్తె సైతం తిరుగుబాటు చేశారు. ఆమె తన భర్తతో కలిసి జనసేనకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంలో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టారని ముద్రగడ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడగా.. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓడిపోయారు. దీంతో చేసిన సవాలు ప్రకారం ముద్రగడ తన పేరు చివర రెడ్డి అని చేర్చుకున్నారు.


Pawan Kalyan: పలు శాఖల అధికారులతో సమీక్షలు.. బిజీబిజీగా పవన్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 20 , 2024 | 11:04 AM