Home » Mulugu
ములుగు జిల్లా: సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజా మందిరాలకు తాళాలు వేస్తారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది.
Telangana: మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్రమంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర (Medaram Maha Jatara) వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. అయితే జాతరలో రెండో రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి చేరుకుంది.
Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.
Telangana: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు.
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.
Telangana: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు.
మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్నారు.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.