Share News

Medaram Jatara: గద్దెపై కంకవణం.. మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం

ABN , Publish Date - Feb 22 , 2024 | 11:16 AM

Telangana: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు.

Medaram Jatara: గద్దెపై కంకవణం.. మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం

మేడారం, ఫిబ్రవరి 22: మేడారం జాతరలో (Medaram Jatara 2024) కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు. చిలకలగుట్ట నుంచి తెచ్చిన ప్రత్యేకజాతి వెదురుబొంగులే ఈ కంకవణాలు. ఈరోజు (గురువారం) సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమక్కను తీసుకురానున్నారు. కుంకుమభరణి రూపంలో ఉన్న అమ్మవారిని కోయ పూజారులు మేడారంకు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టించనున్నారు.

కాగా.. ఇప్పటికే సారమ్మలను ఆదివాసీ పూజారులు కొమ్మ బూరలు ఊదుతూ, డోలు వాయిద్యాలతో తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్టించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపై కొలువుదీరారు. చివరగా సమక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తవుతుంది. సమక్క గద్దెపైకి చేరనున్నడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

భక్తజనసంద్రంగా...

రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండటంతో మేడారం భక్తజనసంద్రంగా మారింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను భక్తులు దర్శించుకుంటున్నారు. ఇసుకేస్తే రాలనంతగా మేడారం ప్రాంగణం జనంతో నిండిపోయింది. గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు గూడారాలతో పరుచుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 01:10 PM