Share News

Seethakka: మేడారం మహా జాతర తీరు మారిందన్న మంత్రి సీతక్క

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:18 PM

Telangana: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు.

Seethakka: మేడారం మహా జాతర తీరు మారిందన్న మంత్రి సీతక్క

మేడారం, ఫిబ్రవరి 21: మేడారం మహా జాతరకు (Medaram Jatara) వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీఎం అయ్యాక తొలిసారి జాతరకు వస్తున్నారని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సీఎంను కోరతానని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2024 | 04:58 PM