Medaram Jatara-2024 Live Updates: జనసంద్రమైన మేడారం.. గద్దెపై కొలుదీరనున్న అమ్మవార్లు..
ABN , First Publish Date - Feb 21 , 2024 | 02:47 PM
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.
Live News & Update
-
2024-02-21T21:00:11+05:30
మేడారం గద్దెపైకి రానున్న సారలమ్మ
మరికాసేపట్లో మేడారం గద్దెపైకి సారలమ్మ రానున్నారు. కన్నేపల్లి నుంచి భారీ బందోబస్తు మధ్య సారలమ్మ మేడారం గద్దె మీదకు చేరనున్నారు. సారలమ్మతో పాటే గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువుదీరనున్నారు.
-
2024-02-21T19:02:53+05:30
మేడారం వెళ్తుండగా ప్రమాదం..
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం సబ్ స్టేషన్ వద్ద కారు తప్పి ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భక్తులు కారులో మేడారం వెళ్తుండగా.. ముందుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
-
2024-02-21T18:58:38+05:30
సమ్మక్క సారక్క ఆలయంలో పూజలు చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం: జిల్లాలో థంసలాపురం సమ్మక్క సారక్క ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూజలు నిర్వహించారు.
-
2024-02-21T18:52:55+05:30
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
-
2024-02-21T17:20:16+05:30
విద్యుత్ దీప కాంతులతో జిగేల్‌మంటున్న మేడారం
మేడారం మహా జాతరలో సంబరాలు అంబరాన్నంటాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎన్నో కనువిందు చేసే ప్రోగ్సామ్స్ ఏర్పాటు చేశారు వర్తకులు. కలర్ ఫుల్ లైట్స్‌తో మేడారం అంతా జిగేల్‌మంటోంది. ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ స్క్రీన్స్, ఎగ్జిబిషన్స్, రంగుల రాట్నాలు మొదలైనవి ఉన్నాయి. మేడారం జాతరకు వెళ్లిన ప్రజలు కొందరు అక్కడి నైట్ విజువల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఆ విజువల్స్‌ను మీరూ చూసేయండి.
-
2024-02-21T17:08:35+05:30
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
అమ్మవార్లను దర్శించుకోవడం సంతోషంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశించాం... కానీ అది జరగలేదు
మేడారం వచ్చే భక్తులకు శానిటేషన్, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి
-
2024-02-21T16:10:06+05:30
ఆకట్టుకుంటున్న డిజిటల్ షో..
మేడారం జాతరలో లేజర్ షో ఆకట్టుకుంటుందోంది. అలాగే భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను ప్రదర్శిస్తున్నారు. ఇది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. -
2024-02-21T15:50:16+05:30
మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సీఎంను కోరతాను : సీతక్క
మేడారం : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయని తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారి జాతరకు వస్తున్నారని, మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సీఎంను కోరతానని చెప్పారు సీతక్క.
-
2024-02-21T15:42:11+05:30
మేడారం: 3,600 ట్రిప్పులు నడిపిన ఆర్టీసీ
మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర నలు మూలల నుంచి 1.50 లక్షల మంది భక్తులను తరలించింది ఆర్టీసీ. ఇప్పటి వరకు 3,600 ట్రిప్పులను ఆర్టీసీ నడిపింది.
-
2024-02-21T15:40:23+05:30
మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
తెలంగాణలో జరుగుతున్న.. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
-
2024-02-21T15:25:09+05:30
ఉచిత నీళ్ల పంపిణీ..
మేడారంలో ఉచిత నీళ్ళ పంపణీ కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి సీతక్క. భక్తులకు నీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
-
2024-02-21T14:58:17+05:30
మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
‘పవిత్రమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. భక్తులందరికీ కోరిన కోర్కెలు నెరవేరేలా అమ్మవారు అనుగ్రహించాలి’ అని ట్వీట్ చేశారు అమిత్ షా.
-
2024-02-21T14:25:48+05:30
-
2024-02-21T14:00:02+05:30
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు. ఇవాళ సారలమ్మ రాకతో మేడారం మహాజాతర మొదలవనుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నేటి రాత్రికి గద్దెపైకి చేరుకుంటారు.