Home » Mumbai
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.
మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే అన్నారు.
‘ఎవరీ సామాన్యురాలు..? అపర కుబేరులు, అతిరథమహారథులు, అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధ్యక్షులు హాజరైన ఈ వేడుకకు ఈమెను ఆహ్వానించారంటే.. ఏదో ప్రత్యేకత ఉండాలి?’ అనుకున్నారంతా!.
బస్సు, రైలు ప్రయాణాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు, త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలని మరికొందరు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ..
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కొందరు యువతీ, యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు. కొంచెం తేడా కొట్టినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ.. లైక్స్ & వ్యూస్ కోసం బరితెగిస్తుంటారు.
సెంట్రల్ రైల్వేలోని డౌండ్ వద్ద జరుగుతున్న నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా గుంతకల్లు(Guntakal) మీదగా వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముంబై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్(Mumbai-Bangalore Express) (నెం. 11301)ను ఈనెల 29వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 11302)ను ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకూ, అలాగే కన్యాకుమారి-పూనా(Kanyakumari-Poona) ఎక్స్‌ప్రెస్ (నెం. 16382)ను ఈ నెల 28, 29 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16381)ని ఈనెల 30, ఆగస్టు 1వ తేదీన పూనే, మీరజ్, కురుద్వాడి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలియజేశారు.
మహారాష్ట్ర(maharashtra)లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు పెద్ద ఎత్తున చేరి చెరవులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే వర్షం నేడు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబై, రాయగడ, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఎడతెరిపి లేని వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. రాజధాని ముంబై, ఐటీ సంస్థల కేంద్రం పుణెతో పాటు రాయ్‌గఢ్, పాల్ఘ ర్ జిల్లాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర(Maharashtra)లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబై(Mumbai)లోని అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.