Share News

Bangladesh Violence: పలువురు బంగ్లాదేశీయులు అరెస్ట్

ABN , Publish Date - Aug 13 , 2024 | 02:15 PM

పొరుగునున్న బంగ్లాదేశ్‌లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భారీగా భారత్‌.. తన బలగాలను మోహరించింది. అలాంటి వేళ.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ఉస్మాన్ కరామట్‌ అలీ బిశ్వాస్‌గా అతడిని గుర్తించారు.

Bangladesh Violence: పలువురు బంగ్లాదేశీయులు అరెస్ట్

ముంబయి, ఆగస్ట్ 13: పొరుగునున్న బంగ్లాదేశ్‌లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భారీగా భారత్‌.. తన బలగాలను మోహరించింది. అలాంటి వేళ.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ఉస్మాన్ కరామట్‌ అలీ బిశ్వాస్‌గా అతడిని గుర్తించారు. 2012 నుంచి అతడు భారత్‌లో నివసిస్తు్న్నాడని పోలీసులు తెలిపారు.


13 ఏళ్ల వయస్సులో బంగ్లాదేశ్ నుంచి..

అతడి వద్ద నుంచి ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డ్, పాస్ట్ పోర్ట్‌తోపాటు పలు నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2016, 2023లలో అతడు పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు విచారణలో అంగీకరించాడు. బంగ్లాదేశ్ నుంచి 13 ఏళ్ల వయస్సులో కోల్‌కతా చేరుకున్నారు. అనంతరం అతడు పుణె చేరుకుని.. అక్కడ పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో అలీ బిశ్వాస్ వెల్లడించారు. అంతేకాకుండా.. అతడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించానని తమ విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.


నవీ ముంబయిలో.. ఐదురుగురు

మరోవైపు.. నవీ ముంబయిలోని కోపరికైరాణె ప్రాంతంలో ఆక్రమంగా నివసిస్తు్న్న ఐదుగురు బంగ్లాదేశ్ జాతీయులను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారించారు. వారంతా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా.. నకిలీ డాక్యుమెంట్లతో ప్రవేశించినట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. వీరు.. ఆ ప్రాంతంలో పలు నివాసాల్లో పని వారిగా ఉన్నారన్నారు. ఇక పురుషుడు పెయింటర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. అయితే వీరిపై ఐపీసీ సెక్షన్ల కింద, దొంగ సంతకాలు, పాస్‌పోర్ట్ రూల్స్ 1950, ఫారెన్ యాక్ట్ 1946 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.


బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు..

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపినా.. అవి సఫలం కాలేదు. ఆ కొద్ది రోజులకే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయకతప్పలేదు. అనంతరం ఆమె తన సోదరి రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు.


ప్రొ. యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు..

ఇక బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం రద్దు చేసి సైనిక పాలన విధించారు. ఆ క్రమంలో ప్రొ. యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఏర్పాటయింది. ఇంకోవైపు.. అసంఖ్యాకులు బంగ్లాదేశీయులు.. భారత్‌లో ప్రవేశించేందుకు సరిహద్దుల వెంబడి వేచి ఉన్నారు. వారిని భారత్‌లోకి ప్రవేశించనీయకుండా సైన్యం గట్టి బందో బస్తు ఏర్పాటు చేసింది. అలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. భారత్‌లోని అతి ముఖ్యమైన మహా నగరాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 02:15 PM