Share News

Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..

ABN , Publish Date - Aug 14 , 2024 | 05:27 PM

ముంబయి నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు.

Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..

ముంబయి, ఆగస్ట్ 14: ముంబయి నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బుధవారం బయలుదేరింది. ఆ కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఎయిర్ ఇండియా సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: Rachakonda CP: రియాజ్‌ను హత్య చేస్తే.. డాన్ అవుతాడనుకున్న హమీద్


ఎయిర్‌పోర్ట్‌లో నిలిచి పోయిన ప్రయాణికులకు మరో విమానంలో లండన్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే సదరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే.. వారికి తిరిగి నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులు చెప్పారు. ఓ వేళ విమాన ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని.. మరో రోజు ప్రయాణించాలనుకుంటే.. అందుకు అవసరమైన ఏర్పాట్లు సైతం చేసేందుకు ఎయిర్ ఇండియా సిద్దంగా ఉందని ఆ సంస్థ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read: Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు


ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది సంక్షేమానికి ఎయిర్ ఇండియా సంస్థ తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అయితే గతేడాది ఇదే తరహా సంఘటన ఎదురయిందని ఎయిర్ ఇండియా సంస్థ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముంబయి నుంచి లండన్ బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. ఆ క్రమంలో విమానంలోని ఎడమ వైపు ఇంజెన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని.. దీంతో విమానాన్ని మళ్లీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సంస్థ అధికారులు గుర్తు చేశారు.

Also Read: Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 05:48 PM