Home » Mumbai
బాలీవుడ్ నటుడు గోవిందా కాలికి బుల్లెట్ గాయమైంది. కప్ బోర్డులో ఉన్న రివాల్వర్ తీసే సమయంలో జారిపడింది. పడిన వెంటనే మిస్ ఫైర్ అయ్యింది.
ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్‌మైషో కంపెనీ ఓనర్లకు ముంబై పోలీసులు షాకిచ్చారు. ప్రముఖ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే టిక్కెట్ల కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ కంపెనీ ఓనర్లకు EOW విభాగం సమన్లు జారీ చేసింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా జనసమర్థంగా ఉన్న ప్రాంతాలతోపాటు మతపరమైన ప్రాంతాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు.
దేశ ఆర్థిక రాజధాని, మహా నగరం ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
కోల్డ్ ప్లే కాన్సర్ట్ టిక్కెట్లు బుకింగ్ ప్రారంభానికి కొద్ది సెకెన్ల ముందే బుక్‌మైషో వెబ్సైట్ క్రాష్ అయ్యింది. ఇది సంగీత ప్రియుల్లో అసహనానికి దారి తీసింది.
రెండు డజన్ల మందికి పైగా భక్తులు నీటిలో పడటంతో ఒక్కసారిగా అందరూ అందోళనకు గురయ్యరు. ఈత తెలిసిన కొందరు ఒడ్డుకు చేరుకోగా, తక్కిన వారిని సమీపంలోని పడవల్లో ఉన్న వారు సురక్షితంగా బయటకు తెచ్చారు.
అరేబియా సముద్రంలో భద్రతను మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో వెళ్తున్న వాహనదారులకు రోడ్డు పక్కన పొదల్లో షాకింగ్ సీన్ కనిపించింది. పొదల్లో ఏదో కదులుతున్నట్లు అనుమానం రావడంతో వాహనదారులంతా సమీపానికి వెళ్లారు. తీరా చివరకు చిరుత పులి చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు..
దేశవ్యాప్తంగా గణపతి నిమజ్జనం జరుగుతుంది. గణేశ్ నిమజ్జనం నేటితో అంటే మంగళవారంతో ముగియనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో వీధులన్నీ భారీ గణనాథులతో ఊరేగింపుగా బయలుదేరాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చారు.