Share News

Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు

ABN , Publish Date - Sep 28 , 2024 | 08:54 AM

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా జనసమర్థంగా ఉన్న ప్రాంతాలతోపాటు మతపరమైన ప్రాంతాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు.

Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు

ముంబయి, సెప్టెంబర్ 28: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా జనసమర్థంగా ఉన్న ప్రాంతాలతోపాటు మతపరమైన ప్రాంతాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు. ఆ యా ప్రాంతాల్లో మాక్ డ్రిల్ సైతం నిర్వహించాలని ఆదేశించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు.

Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన


ఈ ప్రాంతాల్లో భద్రత పటిష్టంపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు వివరించారు. ఎక్కడ ఎటువంటి దాడులు జరగకుండా పోలీసులతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు. మత పరమైన ప్రాంతాల్లో ఎటువంటి అనుమానాస్పద చర్యలకు తావివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం జనసమర్థంగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంతోపాటు రెండు ప్రముఖ మతపరమైన ప్రాంతాల్లో మాక్ డిల్ నిర్వహించినట్లు వివరించారు. ఇప్పటికే గణపతి నవరాత్రులు పూర్తయ్యాయని గుర్తు చేశారు.


మరికొద్ది రోజుల్లో దసరా నవరాత్రులు రంభంకానున్నాయన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అలాగే నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీస్ ఉన్నతాధికారి వివరించారు.

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 09:01 AM