Share News

Kadambari Jethwani: ఏపీ హైకోర్టులో నటి జత్వాని కేసులో కీలక పిటిషన్ల విచారణ

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:15 AM

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది.

Kadambari Jethwani: ఏపీ హైకోర్టులో నటి  జత్వాని కేసులో కీలక పిటిషన్ల విచారణ

అమరావతి: ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. వీరిపై అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


కాదంబరి జత్వానీకి సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ ఇవాళ( మంగళవారం) జరగనుంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును పలువురు ఐపీఎస్‌లు,పోలీస్ అధికారులు ఆశ్రయించారు. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. . నేడు మరోసారి న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. . ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు.


గతంలో ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో సీజ్ చేసిన ఆధారాలు అన్నింటినీ భద్రపరచాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు తమ ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్లను సీజ్‌ చేయకుండా, మొబైల్ ఫోన్లు ఆమెకు తిరిగి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైసీపీ నేత కేవీఆర్ విద్యాసాగర్ హైకోర్టు‌లో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్ట్ ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. జత్వానీ కేసు వివరాలు పూర్తిగా అందించేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కాగా ఈ కేసు దర్యాప్తును మరో సమర్ధవంతమైన అధికారికి అప్పగించేలా విజయవాడ సీపీని ఆదేశించాలని విద్యాసాగర్ కోరారు.


కాగా కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబై వచ్చి తనతో పాటు తన తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని నటి జత్వానీ పేర్కొన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బధించారని ఆమె తెలిపారు. తన పూర్వాపరాలు, ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గన్ని ద్వారా ఆరా తీయించారని నటి జత్వానీ ఫిర్యాదులో వివరించారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసుల రక్షణ కల్పించాలని నటి జత్వానీ కోరారు. పక్కా స్కెచ్‌తోనే కాదంబరి జత్వానీని ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకువచ్చి వైసీపీ నేతలు, పోలీసులు వేధించారు.


మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన సొంత మనుషులను కాపాడుకోవటం కోసం ఓ మహిళను బలి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎస్‌ అధికారులు, పోలీసులు నిబంధలనకు పూర్తి విరుద్ధంగా జత్వానీ కేసులో వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పదేళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్‌ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాలి. ఈ కేసును విచారించే పోలీసులు ఆ నిబంధనలన్నీ తుంగలోకి తొక్కారు. ఈ కథ మొత్తం తాడేపల్లి డైరెక్షన్‌లో సాగింది. పోలీసులు ఆగమేఘాలపై వారెంట్‌ తీసుకుని ముంబై వెళ్లారు. ఎస్‌ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి వెళ్లారు. కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకువచ్చి ఎన్నో విధాలుగా వేధించారు. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేకంగా నియమించిన అధికారి వివరాలు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ. 8,113 కోట్ల షాక్

నేరస్థులను వదలొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 01 , 2024 | 09:21 AM