Home » Nalgonda News
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో కలహాలు సృష్టించింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, అవివాహితుడైన ఓ యువకుడు నెరిపిన బంధం.. వివాదాలు రేపింది. చివరకు ఆ ఇద్దరు రైలు కింద పడి చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ
అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్వోను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు.
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకిరేకల్‌కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణ మాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఆపి.. సోషల్ మీడియా పేరిట పాత్రికేయులుగా వ్యవహరిస్తున్న వారు అర్ధరాత్రి వేళ వసూళ్లకు దిగారు. రూ.4.50 లక్షలు డిమాండ్ చేశారు. రూ.2 లక్షలు ఇచ్చినా.. మిగతా సొమ్ము కోసం పట్టుబట్టారు. దీంతో వాహనదారు పోలీసులను ఆశ్రయించాడు. వారు రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్‌సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నవమాసాలు మోసి, పురిటినొప్పులను భరించి.. తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా.. శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు, కూతుళ్లు తగవులాడుకున్న ఉదంతమిది..! చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు.. ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారాం చేస్తున్నాడు. దీంతో.. కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా.. ఆ అమ్మ మృతదేహం రెండ్రోజులుగా ఫ్రీజర్‌లో ఉండిపోయింది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం త వ్వకం పనులను పునఃప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR Bus Yatra) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ప్రమాదం జరిగింది. 10కి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.