Home » Nalgonda News
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka ) అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి.
తంబాకు ఇవ్వలేదని తోటి వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు, జరిమానా విధించింది.
గడియారం సెంటర్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు కట్టిన బీఆర్ఎస్ పార్టీ తోరణాలతో ప్రధాన రహదారి గులాబిమయమైంది.
నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద ఘొర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతిచెందాడు. మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్‌ను పోలీస్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో బాగు చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కొండగుహలో కొలువైన లక్ష్మీనృసింహుడికి, శివాలయంలో రామలింగేశ్వరుడికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని దుశర్ల సత్యనారాయణ అడవిలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.
రైతులకు మేలు చేసేలా మార్కెటింగ్ విధానం ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్, లోక్‌సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
గంజాయి పీల్చుతూ, ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించే యువకులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.