Jagadish Reddy: నల్గొండలో ఫ్లోరోసిస్‌ను కేసీఆర్ తరిమేశారు
ABN , Publish Date - Feb 13 , 2024 | 06:22 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో బాగు చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు.
నల్గొండ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో బాగు చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మంగళవారం నాడు నల్గొండ సభ వేదికగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. యాభై ఏళ్లలో రెండున్నర లక్షల మంది చనిపోయేలా చేసిన ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆరేళ్లలో కేసీఆర్ తరిమి కొట్టారని తెలిపారు. నాలుగేళ్లలో నల్గొండ జిల్లాలో 3లక్షల టన్నుల నుంచి 40లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండేలా చేశారని అన్నారు. రెండు నెలలుగా సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఏపీకి వెళ్తుంటే ఎవరూ పట్టించుకోలేదని జగదీష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.