Home » Nalgonda
అవి 26 జీవాలు! అందులో 24 ఎద్దులు, రెండు ఆవులున్నాయి! అన్నింటినీ ఒకే కంటెయినర్లో కుక్కేసి సూర్యాపేట నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇదొక్కెత్తయితే.. ఈ తరలింపును అడ్డుకున్న పోలీసులు, ఆ కంటెయినర్‌ను తెరవకుండా 13 గంటలపాటు అలాగే ఉంచారు. మండే ఎండకు లోపల గాలి ఆడక.. మేత లేక.. తాగేందుకు నీరూ లేక ఆ మూగజీవాలు తట్టుకోలేకపోయాయి.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌లో మూడు జిల్లాల పరిధిలోని ఓటర్లలో 73 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.
Telangana Graduate MLC By Elections: తెలంగాణలో(Telangana) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(MLC Election Polling) ముగిసింది. ఖమ్మం(Khammam)-నల్లగొండ(Nalgonda)-వరంగల్(Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకే్‌షరెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.
పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ రూ.50 వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు దీర్ఘకాలికంగా లబ్ధి చేకూర్చే పథకాల కోసం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు రూ.255 కోట్ల విలువైన వస్త్రాల సరఫరా కోసం ఆర్డర్లు వచ్చాయన్నారు.
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకిరేకల్‌కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణ మాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.