Home » Nalgonda
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..
Telangana:బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడి పోయామో తెలియడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ ఓటేయాలని.. రుణమాఫీ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వించారు.
జనగామ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్నారు. జనగామ, దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రోడ్డు పక్కనే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.
నల్గొండ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళతారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రంగంలోకి దిగనున్నారు. ఆదివారం నుంచి ఆయన ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా పర్యటించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన పాపాలే.. ప్రస్తుతం ఆయన్ని చుట్టుముడుతోన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
Telangana: నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అబద్దపు మాటలు చెపుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి తనను చాలా సార్లు కలిశారని.. తెలంగాణ వాటర్ మినిస్టర్‌ను మార్చమని చెప్పానని తెలిపారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి చాలా చెపుతున్నారని... రైతుబందు డబ్బులు ఐదు వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు.