TG Politics: కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు..
ABN , Publish Date - Mar 31 , 2024 | 01:37 PM
బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వించారు.
బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వించారు. బస్సు ఎక్కిన పోలీసులు వాహనం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. వదిలిపెట్టారు. ఎండిన పొలాలు పరిశీలించేందుకు కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన బస్సును పోలీసులు తనిఖీలు చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మొదటిసారి కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరిన నేపథ్యంలో.. ఆయన బస్సును అధికారులు తనిఖీ చేశారు.
KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్న కేసీఆర్
కేసీఆర్ షెడ్యూల్ ఇదే..
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను కేసీఆర్ పరిశీలిస్తారు. తర్వాత అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. సూర్యాపేటలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు సూర్యాపేట పార్టీ ఆఫీస్‌లో కేసీఆర్ ప్రెస్ మిట్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరతారు.
KCR: రైతుల చెంతకు బయల్దేరిన కేసీఆర్.. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారంటే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..