Home » Nalgonda
ఆనలైన బెట్టింగ్‌లతో ఆర్థికంగా నష్టపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలోని జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలాలను గురువారం పరిశీలించి, పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దేశం ఆర్థికంగా దివాళా తీసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.
సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారు భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను రామభక్తులు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. విశ్వహిందూపరిషత, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు అక్షింతల పంపిణీలో పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన(టీపీజేఎంఏ) అధ్యక్షుడిగా చందా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్రామాల్లో బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్న మద్యం దుకాణ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఎక్సైజ్ ఎస్ఐ గురువయ్యను ప్రశ్నించారు.
నిరుపేదలకు చెందాల్సిన ప్రభుత్వ ప్లాట్లపై అక్రమార్కుల కన్నుపడింది. పేదలకు అందాల్సిన ప్లాట్లు అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణదారుల పాలవుతున్నాయి.
హుజూర్నగర్ మునిసిపల్ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశానికి ముహుర్తం ఖరారైంది.