Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:30 PM
పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్‌ను(BRS) వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు.
హైదరాబాద్, జూన్ 21: పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్‌ను(BRS) వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు. పార్లమెంట్ ఫలితాలు వచ్చిన రోజు కూడా ఆయన కేసీఆర్‌తో సాయంత్రం వరకు ఉన్నారని.. రెండు కూటముల మధ్య ఎన్నికలు జరిగాయని అన్నారని గుర్తు చేశారు. ధైర్యంగా నిలబడాలని కేసీఆర్‌కు పోచారం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు జగదీష్ రెడ్డి. ఏం బలహీనతల వల్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారో తెలియదన్నారు. ఈ వయస్సులో పోచారం పార్టీ మారుతారని తాము అనుకోలేదని.. ఆయనకు ఏం వస్తుందో తెలియదు కానీ.. అప్రతిష్ట మూట కట్టుకున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌తోనే స్టార్ట్ కాలే..
పార్టీ మారే ప్రక్రియ ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే ప్రారంభం కాలేదన్నారు జగదీష్ రెడ్డి. దేశంలో కేసీఆర్‌కు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అన్నారు. ఆయన కనుమరుగు కావాలని చాలామంది కోరుకుంటున్నారని అన్నారు. ఎవరు పార్టీని వీడినా.. తట్టుకుని నిలబడతామని చెప్పారు బీఆర్ఎస్ నేత.
వారిని వదిలిపెట్టాలి..
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బాల్క సుమన్, బీఆర్ఎస్‌ను నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. వారు ఏ నేరం చేయలేదని.. వారిని వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ సహచరుడిగా ఆయన ఇంటికి వెళ్లారని.. మన ఇల్లు, మన నాయకుడు అనే భావనతోనే వెళ్లారన్నారు. సీఎంను ఎవరూ ఏమీ చేయలేదన్నారు. ఆ క్షణం వరకు ఆయన తమ నేత ఇల్లు అని అనుకుని వెళ్లారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి కేసులు పెట్టకుండా బాల్క సుమన్ సహా అరెస్ట్ చేసిన నేతలను వదిలిపెట్టాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు ఆ సోయి లేదు..
తెలంగాణ ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఆ సోయి లేదని విమర్శించారు జగదీష్ రెడ్డి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని తాము పోరాటం చేస్తే.. అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. సింగరేణి పరిధిలో బొగ్గు గనులు వేలం వేయడాన్ని తాము ప్రశ్నిస్తే భట్టి తమపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం జరిగిందని భట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. బొగ్గు గనులను కొట్టేసే పెద్దలు ఎవరో కాంగ్రెస్, బీజేపీని ఏకం చేస్తున్నారని ఆరోపించారాయన.
నిన్న ఒక మాట.. నేడు ఒక మాట..
బొగ్గు గనులను వేలం వెయ్యనివ్వమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం నాడు అన్నారని.. ఇవాళ ఆ మాటను మార్చేశారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెప్పిన దానికి.. చేసిన దానికి పొంతనే లేదన్నారు. శ్రావణి బ్లాక్‌ను వేలం పాట నుంచి తీసేశారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క మొసలి కన్నీరు తమకు అవసరం లేదన్నారు. వెస్ట్ ఇన్ బ్లాక్ హోటల్‌కు వెళ్లిన భట్టి.. శ్రావణి బ్లాక్‌ను వేలం నుంచి తీయించారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన మొదటి రోజే తెలంగాణకు ద్రోహం చేసే పనులు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు.