Share News

Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:04 PM

విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleshwaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కృత్రిమ కొరత సృష్టించి వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర ఉందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు అందగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తానన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ పేరుతో రైతు రుణమాఫీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు.


ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తమ చేతగానితనం కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే దురుద్దేశంతోనే ఇలాంటి పనులకు దిగుతున్నారన్నారు.

కాంగ్రెస్ చేసే ఆరోపణల్లో నిజం లేదనే విషయం తెసుస్తోందని.. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు ఉన్న దుస్థితి మళ్లీ కనిపిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతను బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తుందన్నారు. కమిషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి:

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తానని బెదిరించిన సైబర్‌ నేరగాడి అరెస్ట్‌

Updated Date - Jun 12 , 2024 | 03:04 PM