Home » Nalgonda
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఒకేచోట హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు గత సర్కారు చర్యలు తీసుకోగా.. ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.
అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు.
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 3,00,995 క్యూసెక్కులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.300 టీఎంసీలుగా ఉంది.
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు.
‘నేను అమెరికా వెళ్లి ఈనెల 11న తిరిగొస్తా.. ఈలోగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
Telangana Police Caught Gold: కేటుగాళ్లు రోజుకింత రాటుదేలుతున్నారు. పోలీసులను మస్కా కొట్టించి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు చేసేస్తున్నారు. కానీ, అన్ని రోజులూ వారివే కాదు కదా! తాజా ఘటనలో అదే జరిగింది. ఖాకీల తెలివి ముందు.. ఈ కేటుగాళ్లు బేజారయ్యారు. ఇంకేముంది..
బీజేపీలో విలీనం దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోందని, ఆ మేరకు తనకు, ముఖ్యమంత్రికి సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Telangana: భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు.
క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను తన హక్కుగా కోరరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు పాస్‌పోర్ట్ చట్టం అనుమతించదని తెలిపింది.
రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోక్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.