Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత
ABN , Publish Date - Aug 06 , 2024 | 10:26 AM
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 3,00,995 క్యూసెక్కులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.300 టీఎంసీలుగా ఉంది.
నల్గొండ, ఆగస్టు 6: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 3,00,995 క్యూసెక్కులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.300 టీఎంసీలుగా ఉంది. కాగా... ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో అధికారులు తొలుతు ఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం సాయంత్రానికి 16 గేట్ల ద్వారా నీటి దిగువకు విడుదల చేశారు.
YSRCP: వైసీపీకి ఊహించని షాక్..
అలాగే కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2657 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1 వేయి క్యూ సెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 696.650 అడుగులు గాను... పూర్తి సామర్థ్యం 700 అడుగులుగా కొనసాగుతోంది.ఇటు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5758 క్యూసెక్కులు ఉంది. నంది పంప్ హౌజ్‌కు 9450, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 326 క్యూసెక్కులు, ఎన్టీపీసీ కి 121క్యూసెక్కులు ఎత్తి పోతలుగా చేపట్టారు. ప్రస్తుత నీటి మట్టం 14.6276 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి సామర్థ్యం 20.175 టిఎంసీలుగా ఉంది.
Egg Rate: బాబోయ్.. కొండెక్కిన కోడిగుడ్డు ధర!
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రపురం వెంకటగిరి గ్రామాల మధ్య వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయ. పంట పొలాలు సైతం నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. ప్రస్తుత నీటిమట్టం 33 అడుగులు కాగా... నీటి ప్రవాహం 5,36,770 క్యూసెక్కులుగా ఉంది.
ఇవి కూడా చదవండి...
Bangladesh Protest: రిజర్వేషన్లపై యుద్ధంగా మొదలై..
Madanapalle Incident: గత ఐదేళ్లలో ఏదో జరిగింది!
Read Latest Telangana News And Telugu News