Home » Nampalli
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకులు వేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Parankusham Venu: వేణు స్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా మూర్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది.
నాంపల్లి రైల్వే స్టేషన్లో దొంగలు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరుసటి రోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులపై రౌడీ మూకలు కత్తులు, హాకీ కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. అలాగే భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారించనుంది. ఇప్పటికే పోలీసులు ఒకసారి చార్జిషీట్ దాఖలుచేశారు. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారించనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..
చేప ప్రసాదానికి వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం పోటెత్తింది. తెలంగాణ, ఏపీతోపాటు పలురాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని దివంగత బత్తిని హరినాథ్‌గౌడ్ కుటుంబసభ్యులు, సోదరులు ఏటా ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అరస్టయి, రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేయనుంది.
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.