Nampally Court: కేటీఆర్ దావాపై విచారణ 27కు వాయిదా
ABN , Publish Date - Nov 21 , 2024 | 03:51 AM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. సురేఖ తనపై చేసిన వివాదస్పద వ్యాఖ్యల గురించి నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో కేటీఆర్ క్రిమినల్ పరువు నష్టం దావా వే సిన విషయం తెలిసిందే. బుధవారం ఈ దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన వాంగ్మూలాలన్నింటినీ పరిశీలించింది. తదుపరి విచారణలో ఈ దావాకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్, తుల ఉమ స్టేట్‌మెంట్లను న్యాయస్థానం నమోదు చే సిన విషయం తెలిసిందే.