Home » Nara Bhuvaneswari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం అని, ఆ సరైన నాయకుడు చంద్రబాబేనని(Chandrababu) పేర్కొన్నారు నారా భువనేశ్వరి(Bhuvaneshwari). శనివారం నాడు నెల్లూరు(Nellore) జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు.
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణ భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గూడూరు ఏ-5 కన్వెన్షన్‌లో నిర్వహించిన మహిళాశక్తి సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ చేపట్టారు.
సీపీ ప్రభుత్వం (YSRCP Govt) మాఫియా ముఠాలను పెంచి పోషిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు. ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్రతో భాగంగా కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నారా కుటుంబం దర్శించుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మనవడు, యువనేత లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం నారా కుటుంబం తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
‘నిజం గెలవాలి’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి కార్యక్రమానికి ఒక వారం పాటు విరామం ప్రకటించారు. హెరిటేజ్ సంస్థ, ఎన్టీఆర్ ట్రస్ట్ మీటింగ్‌లు ఉండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 10 పర్యటనల ద్వారా మొత్తం 149 బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు.
ఒక్క ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే చంపేశారని.. ఆ మాట జగన్ సొంత చెల్లే చెబుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కష్టాల నడుమ యువగళం పాదయాత్ర చేశారన్నారు.
నిజం గెలవాలి ద్వారా తాను ప్రజల ముందుకు వచ్చానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. గురువారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... విభజన తర్వాత పరిశ్రమలను తీసుకు రావడానికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం, కర్నూల్ జిల్లాల పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన సాగనుంది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. గురువారం జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల ఇంటికి వచ్చి ఓదార్చారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని... టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.