Share News

Nijam Gelavali: సాయం చేయడంలో స్టైల్ మార్చిన నారా భువనేశ్వరి.. కారణమిదే..?

ABN , Publish Date - Feb 27 , 2024 | 09:49 PM

తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టు‌ను తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.

Nijam Gelavali: సాయం చేయడంలో స్టైల్ మార్చిన నారా భువనేశ్వరి.. కారణమిదే..?

అల్లూరి సీతారామరాజు జిల్లా: తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టు‌ను తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అయితే కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో నారా భువనేశ్వరి స్టైల్ మార్చారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి 8 పర్యటనల్లో బాధితులకు సాయం అందజేశారు. 8 పర్యటనల్లోనూ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు ఇచ్చిన విషయం తెలిసిందే. 9వ పర్యటనలో సాయం చేసే విధానాన్ని మార్చారు.

పరామర్శకు వెళ్లకముందే కార్యకర్తల కుటుంబాల అకౌంట్స్‌లోకి సాయాన్ని ఆమె జమ చేశారు. చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్లే పని లేకుండా చేశారు. బాధిత కుటుంబ సభ్యులు నేరుగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకునేలా విధానాన్ని సరళతరం చేశారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయాన్ని అందించిన విషయాన్ని తెలిపే లెటర్‌ను ఇవ్వనున్నారు. భువనేశ్వరి ఇచ్చే లెటర్‌లో కార్యకర్తల పట్ల పార్టీ, పార్టీ అధినేత, కుటుంబ సభ్యుల నిబద్దతను తెలిపేలా వివరాలను పొందుపరిచారు. కాగా.. అరకులోయలోని ముసరిగూడ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి మంగళవారం రూ.మూడు లక్షలు అందజేశారు. ఈ రాత్రి అరకు లోయలోనే నారా భువనేశ్వరి బస చేయనునట్లు సమాచారం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 09:54 PM