Home » Nara Chandra Babu Naidu
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే ఈ యాక్ట్‌తో పేదలు చాలా నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలకు సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) సరైన వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు దిమ్మతిరిగేలా జగన్ కౌంటర్ ఇచ్చారు.
బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్‌గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) అధికార వైసీపీకి (YSRCP).. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు (TDP-BJP-Janasena) చాలా ప్రిస్టేజ్‌గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. జగన్ ఎలా గెలుస్తారో అని కూటమి వ్యూహాలు, ప్రతివ్యూహాల పనిలో నిమగ్నమయ్యాయి.
పోలవరం భారతదేశానికే తలమానికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. మంగళవారం కొయ్యలగూడెంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు...
కూటమి మేనిఫెస్టోను మంగళవారం మధ్యాహ్నం 03 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మేనిఫెస్టోపై ఏపీలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్న పరిస్థితి. మేనిఫెస్టో ప్రకటన అనంతరం దెందలూరు ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోపై తొలిసారి రియాక్ట్ అయ్యారు. వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టోలకు ఉన్న తేడాను నిశితంగా ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan Kalyan) రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం...