Share News

AP Elections 2024: పోలవరం ప్రజలకు పవన్ కీలక హామీ..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:46 PM

పోలవరం భారతదేశానికే తలమానికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. మంగళవారం కొయ్యలగూడెంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు...

AP Elections 2024: పోలవరం ప్రజలకు పవన్ కీలక హామీ..!

ఏలూరు: పోలవరం భారతదేశానికే తలమానికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. మంగళవారం కొయ్యలగూడెంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు కీలకమైందని చెప్పారు. పోలవరం లక్షా 60 వేల మంది నిర్వాసితులను గుర్తించామన్నారు.7వేల మందిని పునరావస కాలనీలకు తరలించారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు తరచుగా వచ్చేవారని తెలిపారు. జగన్ మాత్రం ప్రాజెక్టుకు ఎవరు రాకుండా ఆంక్షలు విధించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.


Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పోలవరం గురించి మాట్లాడుతానని.. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రూ.40వేల కోట్లతో పోలవరం ప్రారంభం అయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 50 శాతం పనులను టీడీపీ హయాంలోనే జరిగాయని వివరించారు. లక్షా 60 వేల మందికి నిర్వాసితుల బాగుచేయాలంటే రూ.30వేల కోట్ల అవుతుందని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. అందుకే జగన్ ప్రాజెక్టును ముందుకు సాగనివ్వటం లేదన్నారు.


పోలవరాన్ని జిల్లాగా మార్చాలన్న యోచనపై చంద్రబాబు, తాను చర్చించామని తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రికి ఈ ప్రాజెక్టు‌పై అసలు క్లారిటీ లేదన్నారు. ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే తనకేం తెలుసునని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారని మండిపడ్డారు. 2019లో అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంతో అన్ని సమస్యలేనని చెప్పారు. పోలవరం నిర్వాసితులు పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:53 PM