TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం
ABN , Publish Date - May 01 , 2024 | 07:29 AM
బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాల (Cheerala)లో జరిగే ప్రజాగళం (Prajagalam) బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య (MM Kondaiah) మాట్లాడుతూ.. 216 జాతీయ రహదారి పక్కనున్న టీడీపీ కార్యాలయం (TDP Office) పక్కనున్న ఖాళీ స్థలంలో చంద్రబాబు సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, బాపట్ల పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని మిగిలిన ఆరు నియోజవకర్గాల నేతలు, కార్యకర్తలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.
కాగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, పక్కన బహిరంగ సభ వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి సోమవారం కొండయ్య, టీడీపీ బాపట్ల పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, బాపట్ల పార్లమెంట్ నియోజకర్గ అధ్యక్షుడు సలగల రాజశేఖర్‌బాబుతో కలసి వేదపండితుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించా రు. అనంతరం వారు మాట్లాడుతూ బుధవారం చీరాలలో జరిగే చంద్రబాబు సభను జయప్రదం చేసేందుకు కూటమి శ్రేణులు విస్తృతంగా సంయమనంతో జయప్రదం చేసేందుకు కదం తొక్కాలన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలుతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. జనం ఆస్తిపై జగన్ కన్ను పడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జగన్ అనే కంఠకుడి నుంచి రాష్ట్ర విముక్తికి కార్యోన్ముఖులవుతున్నారన్నారు. భావసారూప్యం ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకుపోతూ జగన్ అండ్ కోను సాగనంపే క్రమంలో శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు, దిశానిర్దేశం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారన్నారు. చంద్రబాబు సభను జయప్రదం చేయటం ద్వారా కూటమి శ్రేణుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News