Home » Nara Chandra Babu Naidu
పెడన నియోజకవర్గ టికెట్ వస్తుందని ఆశించానని రాకపోవడంతో కొంత నిరాశ చెందానని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ (Buragadda Vedavyas) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) విజన్ ఉన్న నాయకుడని ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నానని చెప్పారు.
జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గురువారం నాడు అంబాజీపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ (CM Jagan)పై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం నుంచి ఏపీని కాపాడటానికే తెలుగుదేశం - జనసేన - బీజేపీ మూడు పార్టీలు కలిసి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. గురువారం నాడు అంబాజీపేటలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప.గో.జిల్లా: రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు.
ప.గో. జిల్లా: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్ధరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తుల్లో భాగంగా కొంత మంది నేతలకు చంద్రబాబు టికెట్లు ఇవ్వలేక పోయారు. వారిని ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పినా పింఛన్దారులను ఎండలో సచివాలయాలకు తిప్పారని మండిపడ్డారు.
దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్(CM Jagan) విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపు రేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదన్నారు.మూడు రాజధానులు అని మాట్లాడటానికి జగన్కు సిగ్గు, ఎగ్గు ఉందా అని నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan)కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై జగన్కు ఎన్నికల సంఘం (Election Commission) నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వలని ఈసీ ఆదేశించింది.
అమరావతి: ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.