Share News

AP Election 2024: రెండు, మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ.. వేదవ్యాస్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 11 , 2024 | 09:12 PM

పెడన నియోజకవర్గ టికెట్ వస్తుందని ఆశించానని రాకపోవడంతో కొంత నిరాశ చెందానని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ (Buragadda Vedavyas) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) విజన్ ఉన్న నాయకుడని ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నానని చెప్పారు.

AP Election 2024: రెండు, మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ.. వేదవ్యాస్ కీలక వ్యాఖ్యలు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం : పెడన నియోజకవర్గ టికెట్ వస్తుందని ఆశించానని రాకపోవడంతో కొంత నిరాశ చెందానని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ (Buragadda Vedavyas) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) విజన్ ఉన్న నాయకుడని ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నానని చెప్పారు. 2019లోనే పెడన నుంచి పోటీ చేస్తానంటే చంద్రబాబు మాటకు గౌరవం ఇచ్చి పోటీ నుంచి తప్పుకున్నానని తెలిపారు. 2024లో టికెట్ ఇస్తానని ఆనాడే చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.


Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత పొత్తుల్లో పెడన టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం జరిగిందన్నారుఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలిశానని చెప్పారు. గతంలో పీఆర్పీలో తాను నష్టపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చెప్పానని గుర్తుచేశారు. ఆయన కూడా తన పట్ల సానుకూలత చూపించారని కానీ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. పెడన టికెట్‌ని మరొకరికి ఇచ్చారని దీంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.


తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసంతృప్తికి గురయ్యానని వాపోయారు. ఆ తర్వాత కొంత ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నానని అన్నారు. 1967 నుంచి తమ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తాను గానీ, తన తండ్రి గానీ ప్రతి ఎలక్షన్‌లో పోటీ చేశామని తెలిపారు.


Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

ఈ సారి కూడా పోటీ చేసి పెడన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలని పరితపించానని కానీ తనకు పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇవ్వలేదన్నారు. తనకు టికెట్ దక్కకపోవటంతో వేలాది మంది తన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని అన్నారుఇండింపెండెంట్‌గా పోటీ చేయాలని తన అభిమానులు ఒత్తిడి తెచ్చారన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు.


కానీ తన అభిమానుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని అన్నారు..రెండు, మూడు రోజుల్లో అభిమానులతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతానికి తాను టీడీపీలోనే కొనసాగుతున్నానని అన్నారు. పార్టీ మార్పు అంశాన్ని కూడా అభిమానులతో సమావేశమైన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.


ఇవి కూడా చదవండి

YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 09:36 PM